అక్రమంగా తరలిస్తున్న మూడు టిప్పర్లపై కేసు నమోదు.. ఎస్సై రాజు
బిచ్కుంద జూలై 2 జనం న్యూస్:కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గుండెనిమిలి శివారులో నుండి అక్రమంగా అనుమతులు లేకుండా మూడు టిప్పర్లను తరలిస్తుండగా బండారంజల్‌కు చెందిన గ్రామస్తులు నిన్న రాత్రి పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.అనుమతులు లేకుండా తరలిస్తున్న వాహనాలపై కేసు నమోదు చేశామని బిచ్కుంద ఎస్సై రాజు తెలిపారు.అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజు స్పష్టం చేశారు.