ప్రజా సమస్యల పరిష్కారమే జనవాణి ప్రధాన లక్ష్యం
జనం న్యూస్, జూలై 01,అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా యలమంచిలి జిల్లా పరిషత్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలు, వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి సమస్యలైనా పార్టీలకు అతీతంగా తన దృష్టికి తీసుకువస్తే, వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని,ప్రజా సమస్యల పరిష్కారమే జనవాణి కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, నాలుగు మండలాల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.