ముమ్మిడివరంలో 173 మందికి 1.35 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

July 1, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ జూలై 1 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు తెలిపారు.మురమళ్ళలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో 173 మంది లబ్ధిదారులకు 1.35 కోట్ల రూపాయల చెక్కులు అందజేశారు.ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, అనారోగ్యం లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.సీఎంఆర్ఎఫ్ ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం కష్టకాలంలో కుటుంబాలకు భరోసా ఇస్తోందని, ప్రజల సంక్షేమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ముమ్మిడివరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1130 మంది లబ్ధిదారులకు మొత్తం 7.50 కోట్ల రూపాయలు సహాయం అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు ,నాగిడి నాగేశ్వరరావు, చెల్లి అశోక్, చెల్లి సురేష్, నడింపల్లి సుబ్బరాజు, ఐ పోలవరం టిడిపి అధ్యక్షులు సూరిబాబు రాజు, రాజేష్ రాజు, కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper