పూడిమడకలో ప్రభుత్వ భూమిని కాపాడాలని వినతి
జనం న్యూస్, జూలై 01,అచ్యుతాపురం: అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామంలో సర్వే నెంబర్లు 52, 53, 54, 55, 82,83 లో గల సుమారు 80 ఎకరాలు సిఆర్ జడ్ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ భూమిలో అక్రమ లేఔట్ ,వంతెనలు నిర్మించి పూడిమడక గ్రామానికి ముప్పు తెచ్చే విధంగా నిర్మాణాలు చేపడుతున్నారని,ఈ నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని అక్రమార్కులపై చర్యలు తీసుకొని పూడిమడక మత్స్యకారులకు జీవనాధారమైన ఉప్పుటేరును కాపాడాలని ఈరోజు అచ్యుతాపురం తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కి సీపీఎం నాయకులు మరియు స్థానికులు వినతి పత్రాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం అచ్యుతాపురం కన్వీనర్ ఆర్ రాము, పూడి మడక శాఖ కార్యదర్శి చేపల తాతయ్య, సీపీఎం నాయకులు కె సోము నాయుడు, మత్స్యకారులు చోడపల్లి పెంటయ్య,ఎరిపల్లి శ్రీను,మేరుగు కొర్లయ్య,పి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.