ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి మండల అధ్యక్షులు భాస్కర్
జనం న్యూస్ జులై 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గో టు విలేజ్ కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ 32వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో జూలై 7న ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకై మండలంలోని కొప్పుల గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మామిడి తిరుపతి మాదిగ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి ఎంఎస్పి మండల అధ్యక్షులు మామిడి భాస్కర్ మాదిగ హాజరై అనంతరం ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ 30 సంవత్సరాల పోరాట ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ వర్గీకరణ ఫలితాలు సాధించారు ఈ ఫలితాలు మాదిగ జాతి పిల్లలందరూ చదువుతూ చదువులో ముందుండి ఫలితాలు అనుభవించాలని కోరుతూ జూలై 7న ఎమ్మార్పీఎస్ 32వ సంవత్సర జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని దళిత ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము ఈ సమావేశంలో గ్రామ ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ మామిడి అశోక్ ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు మామిడి తిరుపతి గ్రామ వార్డు సభ్యులు కుమ్మరి రాజయ్య మామిడి సదానందం ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్ ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శి మన తిరుపతి మెకానిక్ గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీనివాస్ మాస్ అశోక్ జలుగు రు రాజు మామిడి మొగిలి గ్రామస్తులు పాల్గొన్నారు…..