దివంగత నేత గొట్టిముక్కల పద్మారావుకు ఘన నివాళులుదశదిన కార్యక్రమానికి హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్

July 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : దివంగత రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు దశదిన కార్యక్రమం గురువారం వివేకానంద నగర్ కాలనీలోని ఆయన స్వగృహంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా గొట్టిముక్కల పద్మారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన బండి రమేష్, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా ఉద్యమాలకు పద్మారావు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.దివంగత నేత ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని గొట్టిముక్కల పద్మారావుకు ఘన నివాళులర్పించారు.

🌐 Select Language:
📰 ePaper