తెలంగాణ భవన్‌కు చర్చకు జూపల్లి రాకుండ,బిఆర్ఎస్ నాయకులను చర్చకు పిలిచి తోకముడిచిన కాంగ్రెస్ మంత్రులు…ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

July 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి. బి. వీరేశం : 02-07-2026 బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాలనపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి.ఆర్. గారు స్పందించి సవాల్‌ను స్వీకరించి చర్చకు సిద్ధమన్నారు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు .మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ భవన్‌కు వచ్చి చర్చిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాస్తవాలను ఎదుర్కొనే దమ్ము,ధైర్యం లేక నిర్ణయించిన సమయానికి తెలంగాణా భవన్ కు రాకుండ తోకముడిచి,గన్ పార్క్ కి మేము వస్తున్నాం, దమ్ముంటే రండి అని ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు సవాల్ విసిరితే.ఆ సవాల్ ను స్వీకరించి హరిష్ రావు గారు బయలుదేరితే తోకముడిచిన కాంగ్రెస్ మంత్రులు. బిఆర్ఎస్ నాయకులు చర్చకు వస్తే వారి అవినీతి, స్కాములు, వాస్తవాలు, బయట పడతాయనే భయంతో,ప్రజల ముందు పరువు పోతుందనే భయంతో పోలీసులను అడ్డు పెట్టుకొని గన్ పార్క్ వరకు వెళ్లకుండా అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం.మంత్రి జూపల్లి కోసం తెలంగాణ భవన్ వద్ద కుర్చీ వేసి వేచి చూసిన ఆయన రాలేదు.కాంగ్రెస్ మంత్రులు అక్కడ కూర్చుని తొడలు కొడితే ప్రయోజనం ఏమిటి?మంత్రులు శ్రీ అద్లూరి లక్ష్మణ్ కుమార్, శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీ మహ్మద్ అజహరుద్దీన్ గార్లు గన్‌పార్క్ వద్దకు రావాలని ప్రకటించగా, ఆ చర్చకు వెళ్లేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీ హరీశ్ రావు గారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం:తెలంగాణ భవన్‌కు వస్తామని చెప్పిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఎందుకు రాలేదు?గన్‌పార్క్ వద్ద చర్చకు వెళ్తున్న హరీశ్ రావు గారిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు ఎందుకు అరెస్ట్ చేశారు?
పై ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. *ప్రజలకు జవాబు చెప్పే దమ్ము,ధైర్యం ఉంటే చర్చకు రండి. అరెస్టులతో కాదు, వాస్తవాలతో సమాధానం చెప్పండి.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్దన్న పాటిల్,ఈశ్వరప్ప,యస్.గోపాల్,మాణిక్యప్ప,తదితరులు ఉన్నారు

🌐 Select Language:
📰 ePaper