ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు క్రాంతి కుమార్
జనం న్యూస్ జులై 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకోవాలని బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మారపెల్లి క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రాంతి కుమార్ మాట్లాడుతూ శాయంపేట రైతు వేదిక పక్కనున్న ప్రభుత్వ స్థలంలో వివిధ సందర్భాలలో అంబేద్కర్ భవనం ఏర్పాటు చేస్తామని అందుకు సంబంధించిన ఏర్పాట్లు త్వరగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గండ్ర గతంలో చెప్పారని అన్నారు. నెలలు గడుస్తున్న హామీపై ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే భవన నిర్మాణం చేపట్టాలని, అందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మొగ్గం సుమన్, ఉపాధ్యక్షుడు మారపల్లి విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు మారపల్లి సుధాకర్ (డాన్), దళిత సంఘం జిల్లా నాయకులు అరికిల్ల దేవయ్య తదితరులు పాల్గొన్నారు…