నల్లగొండ జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవర్ ను కలిసిన ఎస్ పి ఎఫ్ అధికారులు

July 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్- జూలై 3- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్ పి ఎఫ్) అధికారులు గురువారం నల్గొండ జిల్లా సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ శరత్ చంద్ర పవర్ ను జిల్లా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నాగార్జునసాగర్ ఎస్ పి ఎఫ్ విభాగం అసిస్టెంట్ కమాండెడ్ బి రాజు ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను కలిసి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎస్ పి ఎఫ్ విభాగం అసిస్టెంట్ కమాండెంట్ బి రాజు మాట్లాడుతూ నాగార్జునసాగర్ లోని నాగార్జునసాగర్ డ్యాం, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో భద్రత నిర్వహణలో జిల్లా పోలీస్ యంత్రాంగం నుండి పూర్తి సహకారం ఉంటుందని జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవర్ తెలిపారన్నారు. జిల్లా ఎస్ పి ని కలిసిన వారిలో సాగర్ డ్యాం ఎస్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, జెన్కో ఎస్ పి ఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్ తదితరులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper