ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బయట మైకులు పట్టుకుని సవాళ్లు విసరడం ఏంది మంత్రి

July 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 03 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జూపల్లి కృష్ణారావు పూటకో పార్టీ మారడం మానేసి ముందు మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేయండి గోపాల్ రెడ్డి ఆల్వాల్ పాడు పొన్నం ప్రభాకర్ మీరు మాట్లాడేది చూస్తుంటే ఎట్లుంది అంటే మేం రికార్డులతో వచ్చాం.. తేల్చుకుందాం అని అంత బిల్డప్ ఇచ్చింది ఇదా అవతలి పక్క మా లీడర్ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ని హరీష్ రావు ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో బంధించాక ఇక్కడ మీరు మైకుల ముందు సింహాల్లా గర్జించడం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు గురుకులాల్లో జరిగిన వేల కోట్ల టెండర్ల అవినీతిని ఆర్ యస్ పి సార్ లెక్కలతో సహా నిలదీస్తుంటే ఆయన్ని పట్టుకుని తాడు బొంగరం లేనివాడు అంటూ మీ స్థాయిని తగ్గించుకుని మాట్లాడటం మీ అహంకారానికి నిదర్శనం. ప్రజా సమస్యలపై గొంతెత్తే ఆర్ యస్ పి లాంటి మేధావులను ఎదుర్కొనే ధైర్యం లేకే పోలీసులను ముందు పెట్టి ఈ దొంగ దెబ్బ తీశారు. మీది ప్రజా పాలన పోలీస్ పాలననా ప్రత్యర్థిని కట్టేసి, మైదానంలోకి రమ్మని సవాల్ విసిరినట్టుంది మీ తీరు ఆర్ యస్ పి పోలీస్ స్టేషన్ నుంచే సూటిగా సవాల్ విసిరారు దమ్ముంటే మంత్రులు కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కైనా రండి లేదా మమ్మల్ని గన్ పార్క్ వద్దకైనా రానివ్వండి మరి మీ దగ్గర అన్ని రికార్డులు ఉంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ముఖాముఖి తేల్చుకునే దమ్ము మీకు లేకపాయే చర్చకు భయపడి గన్ పార్క్ నుండి మీ కాంగ్రెస్ మంత్రులు పారిపోవడం విలేఖరులు నిలదీస్తే మీ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ లాంటి వాళ్లు పొంతన లేని సమాధానాలు చెప్పడం తెలంగాణ మొత్తం చూసింది. నిన్నటి దాకా మాజీ మంత్రులతోనే చర్చిస్తాం అన్నారు ఇవాళ కేటీఆర్ హరీష్ రావు వస్తుంటే భయపడి అరెస్టులు చేయించి ఇప్పుడు కేసీఆర్ వస్తేనే చర్చలు, అసెంబ్లీకి రండి అంటూ పిల్లిమొగ్గలు వేస్తున్నారు ఆరోపణల విలువ 2వేల కోట్లా, 5వేల కోట్లా అనేది కాదు మంత్రి అసలు అక్కడ అక్రమాలు జరిగాయా లేదా అన్నదే అసలు ప్రశ్న. విపక్ష నేతల నోళ్లు నొక్కేసి పోలీసుల వెనుక దాక్కుని మీరు చేసే ప్రసంగాలను నమ్మడానికి ఇక్కడెవరూ అమాయకులు లేరు. ఇది తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ అని మీరే చెప్పారు కదా.. ఆ స్ఫూర్తి ప్రశ్నించడాన్నే నేర్పింది. ఇప్పటికైనా ఈ అరెస్టుల రాజకీయం పక్కన పెట్టి..ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పని చేయండి దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ప్రజల ముందే బహిరంగ చర్చకు రండి మా అర్ యస్ పి సార్ అడిగే ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పాల్సిందే

🌐 Select Language:
📰 ePaper