సైనికుల సేవలను దేశం ఎప్పటికీ మరువబోదు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి**

July 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం సైనికుల సేవలను దేశం ఎప్పటికీ మరువబోదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ అరికిళ్ల ప్రవీణ్ ఏడాది మాసిక కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జవాన్ ప్రవీణ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. అరికిళ్ల ప్రవీణ్ యువతకు ఆదర్శమని, ఇలాంటి వారిని సమాజం ఎప్పటికీ గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. అనంతరం జవాన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జవాన్ తల్లిదండ్రులు అరికిళ్ల చేరాలు, భద్రమ్మ, జవాన్ సోదరుడు మాజీ సర్పంచ్ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు,, కుటుంబ సభ్యులు, యువకులు, పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రవీణ్ కు ఘనంగా. నివాళులర్పించారు..

🌐 Select Language:
📰 ePaper