అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించిన జనసేన నాయకులు: ప్రేమ కుమార్
జనం న్యూస్ జూలై 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : మోతీనగర్ లీలా హాస్పిటల్ లో న్యూరో సమస్య తో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్న అల్లాపూర్ కు చెందిన జనసేన కార్యకర్త ప్రసాద్ గారిని పరామర్శించిన కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్ట్ ఎం ఎల్ ఏ అభ్యర్ది ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి, ప్రస్తుతం జరుగుతున్న చికిత్స వివరాలు, అవసరమైన మెడికల్ టెస్ట్‌లు, మందులు, మరియు రికవరీ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలియజేసుకున్నారు. ఆయనకు కావాల్సిన అన్ని వైద్య సాయం త్వరితగతిన అందేలా ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే కార్యకర్త కుటుంబ సభ్యులను ధైర్యపరుస్తూ, పార్టీ తరఫున ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటామని, అవసరమైన సహాయాన్ని అందించేందుకు ముందుంటామని హామీ ఇచ్చారు.తరువాత ప్రసాద్ తో కాసేపు మాట్లాడి, మానసికంగా ధైర్యం ఇవ్వడం జరిగింది. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ప్రేమ కుమార్ తెలిపారు.ఈ అనారోగ్య విషయం పై నియోజక నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్ ప్రసాద్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు.