కూకట్ పల్లి కాంగ్రెస్ డివిజన్ నూతన అధ్యక్షులు కావేటి నాగార్జునకు శుభాకాంక్షలు తెలియజేసిన తెల్ల హరికృష్ణ
జనం న్యూస్ జూలై 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కావేటి నాగార్జునకు తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకుడు, సీనియర్ జర్నలిస్టు తెల్ల హరికృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. భాగ్యనగర్ కాలనీలోని నాగార్జున కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన హరికృష్ణ, ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కావేటి నాగార్జున నాయకత్వంలో కూకట్‌పల్లి డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు ఎం. వెంకటరమణ, రాకేష్, భాను, అవినాష్ తదితరులు పాల్గొని కావేటి నాగార్జునకు శుభాకాంక్షలు తెలియజేశారు.