పత్తిపాక గ్రామంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

July 7, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో మాదిగల హక్కుల కోసం ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తుడుం వెంకటేష్ మరియు గ్రామ కమిటి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు పోతుగంటి సాంబరాజు జెండా ఆవిష్కరించారు అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ ఉప సర్పంచ్ తుడుంరాజు హాజరై కొబ్బరికాయ కొట్టి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుక సందర్భంగా మహిళా నాయకురాలు కోడూరి రాధా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ తుడుం రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామం లో జులై 7, 1994 న మంద కృష్ణ మాదిగ చే స్థాపింపబడిన సామాజిక రాజకీయ ఉద్యమం నేడు 32 సంవత్సరాలు పూర్తి చేసుకొని, ఎస్సీ వర్గీకరణ లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మాదిగల ఆత్మగౌరవ పోరాటంలో ఎమ్మార్పీఎస్ పాత్ర కీలకమని కొనియాడారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు గజ్జి రాజు, గజ్జి రమేష్, పోతుగంటి ప్రమీల సారయ్య, బిఆర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షులు పసుల ప్రవీణ్, మైలారం మాజీ సర్పంచ్ మస్కి సదయ్య, తుడుం రవీందర్ ,బల్గూరి రాజు, తుడుం కుమారస్వామి, కత్తి మొగిలి, నక్కరాజు, తుడుం ప్రభాకర్, తుడుం మోహన్ బాబు, పరకాల వెంకటేష్, పరకాల తిరుపతి, గజ్జి దీపక్ తదితరులు పాల్గొన్నారు……

🌐 Select Language:
📰 ePaper