కిడ్నీ బాధితుడికి రూ.20 వేల ఆర్థిక సాయం

July 7, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజవర్గంకిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రూ.20 వేల ఆర్థిక సహాయం అందించారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం లంకల గన్నవరం గ్రామం వేమనవారి పాలెంకు చెందిన వేమన కిరణ్ కుమార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సుభాష్ జూలై 7న అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు.పి. గన్నవరంకు చెందిన తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి సంసాని పెద్దిరాజు ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితుడికి వ్యక్తిగతంగా రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి ధైర్యం చెప్పారు.ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందుతున్న కుటుంబానికి ప్రభుత్వం సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. అవసరమైన మేరకు వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆపదలో ఉన్న కుటుంబాలను స్వయంగా పరామర్శిస్తూ ఆర్థిక సహాయం అందించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న మంత్రి సేవలను వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో దొంగ శ్రీను, గనిశెట్టి ఈశ్వర్, వేమన రామకృష్ణ, వేమన గంగాధర్, శేరు శీను, వేమన శ్రీను, వేమన సత్తిబాబు, అంబటి మణికంఠ, కామాడి రామకృష్ణ, అనిశెట్టి నరేష్, యర్రంశెట్టి చిన్న తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper