మెడికల్ కాలేజీ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్

May 12, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 12 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : వైద్య వృత్తిని దైవంగా భావిస్తేనే ఉన్నతంగా రాణిస్తారు ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడి చదివి పేద ప్రజలకు సేవలు అందించాలి త్వరలోనే మెడికల్ కాలేజీ నూతన భవనం ప్రారంభిస్తాం నిన్న రాత్రి గద్వాల జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీ నందు మెడికల్ కాలేజీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా హాజరయ్యారు.ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కళాశాల విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు .ఎమ్మెల్యే కి జిల్లా కలెక్టర్ కి కళాశాల ప్రిన్సిపాల్ లెక్చరర్స్ శాలువా కప్పి మెమొంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఎమ్మెల్యే మెడికల్ కాలేజీ విద్యార్థులకు క్రికెట్ కిట్టును, డిజె సౌండ్ బాక్స్ ను అందజేశారు.స్పెషల్ డే సందర్భంగా నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా మెమోటోలను పంపిణీ చేశారు.విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారుశవిద్యార్థులు నిర్వహించిన సంస్కృత కార్యక్రమాలను ఎమ్మెల్యే కలెక్టర్ తిలకించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మెడికల్ కాలేజీ నూతనంగా చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరికి హార్థిక శుభాకాంక్షలు మెడికల్ కళాశాలలో సీటు సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి విద్యార్థులు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తక్కువగా ఉండేది తెలంగాణ రాష్ట్ర వేడుపడిన తర్వాతనే ప్రతి జిల్లాలో గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. గద్వాల కూడా మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కృషిచేసి గద్వాలకు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగిందని తెలిపారు.మెడికల్ కాలేజీ లో చదివే విద్యార్థులు ప్రతిరోజు సుమారు 12 గంటల నుండి 15 గంటల వరకు చదవాలి అన్నారు.ప్రజలకు సేవ చేయాలని దృఢమైన సంకల్పంతో మెడికల్ వైద్య వృత్తిలోకి శిక్షణ పొంది భవిష్యత్తులో వైద్యులుగా పేద ప్రజలకు మెరుగైన చికిత్సను అందించాలి అని తెలిపారు.మెడికల్ కాలేజీ నిర్మాణం పనులు ప్రారంభం కావడం జరిగింది త్వరలోనే అన్ని హంగులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి కావడం జరుగుతుందని తెలిపారు.వచ్చే విద్యా సంవత్సరానికి మెడికల్ కాలేజీలో 100 మంది విద్యార్థులు అడ్మిషన్ అయ్యేవిధంగా చూడాలని విద్యార్థులు కోరారు వాటిని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని తెలిపారు. గద్వాల మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించి మీ తల్లిదండ్రులకు గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో మొట్టమొదటిసారిగా ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో చిట్ట చివరి ప్రాంతమైన జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో మెడికల్ కాలేజీ రావడానికి ఎమ్మెల్యే ఎంతో కృషి చేసి గద్వాలలో కూడా మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజీ తీసుకురావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు.. ఈ మెడికల్ కాలేజీలు చెబుతున్న విద్యార్థులకు కొన్ని సమస్యలు ఉంటాయి వాటిని పరిష్కరించడం ముందుకు వెళ్లాలి కొత్త జిల్లాలలో మెడికల్ కాలేజీ కొత్తగా ఏర్పాటు కావడం జరిగింది త్వరలోనే వాటిని అన్ని రంగులతో అన్ని రకాల సౌకర్యాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసి భవిష్యత్తులో మెడికల్ కాలేజీ అన్ని రకాల సౌకర్యాలకు విద్యార్థులకు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేసే విధంగా జరుగుతుందని తెలిపారు.మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను అందించాలని కోరారు.గద్వాల ప్రాంతంలోని మెడికల్ కళాశాల చదువుకున్న విద్యార్థులు గద్వాల ప్రాంతం లోని ప్రజలకు మెరుగైన సేవలు అందించి అదేవిధంగా గద్వాల ప్రాంతానికి మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు మెడికల్ కాలేజీలో ఎటువంటి సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకోరండి వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే విధంగా నా వంతు ప్రయత్నిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపర్డెంట్, జిల్లా సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, జీ వేణుగోపాల్, మాజీ ఎంపీపీ విజయ్, జిల్లా డీసీసీ మెడికల్ అండ్ హెల్త్ చైర్మన్ డాక్టర్ నర్సింగ్ రావు, మాజీ కౌన్సిలర్ మురళి నరహరి శ్రీనివాసులు, నాయకులు గోవిందు, సాయి శ్యామ్ రెడ్డి, వంట భాస్కర్, బంగి సుదర్శన్, మధు, నరేందర్ రెడ్డి, కొత్త గణేష్, మెడికల్ కాలేజీ వైట్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, మెడికల్ కాలేజీ లెక్చరర్స్ ఫ్యాకల్టీ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

📰 ePaper