పుట్ పాత్ అక్రమణలకు మంగళం పడేనా మంగళవారం పుట్ పాత్ అక్రమణల తొలగింపునకు రంగం సిద్దం

May 12, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 12 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : ఇప్పటికే మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులు షాపు యజమానులకు మౌఖిక ఆదేశాలు జోగులాంబ గద్వాల్ జిల్లా మున్సిపాలిటి పరిధిలోని రోడ్డుకు ఇరువైపులా పుట్ పాత్ అక్రమించి, డబ్బాలు వేసి వ్యాపారాలు కొనసాగించడంతో పాదచారులకు నరకంగా మారిన పుట్‌పాత్ అక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా, మంగళవారం భారీ స్థాయిలో అక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టేందుకు గద్వాల మున్సిపల్ మరియు ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం సర్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపల్ అధికారులు అక్రమణకు గురైన పుట్ పాత్ లను , రోడ్లను గుర్తించి మార్కింగ్ వేయడం జరిగింది. ఈ మేరకు ప్రధాన రహదారుల వెంట ఉన్న దుకాణదారులకు, తోపుడు బండ్ల వ్యాపారులకు మున్సిపల్ అధికారులు మరియు ట్రాఫిక్ పోలీసులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్రాఫిక్ ఆర్ఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ బాల చంద్రుడు కృష్ణవేణి చౌరస్తా నుంచి భీంనగర్ లో గల షాపుల యజమానులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు‌. పుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్లు, సామాగ్రిని స్వచ్ఛందంగా తొలగించుకోవాలని సూచించారు. గద్వాల పట్టణంలో కృష్ణవేణి చౌరస్తా నుంచి ఆంబేద్కర్ చౌరస్తా, కృష్ణవేణి చౌరస్తా నుంచి భీంనగర్ వరకు అధికారులు ఎక్కడి వరకు మార్కింగ్ చేశారో అక్కడి వరకు అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగించేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది.

📰 ePaper