వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న వెంకటేశ్వర నగర్ (కూకట్పల్లి) డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి
జనం న్యూస్ జులై 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలు పాపిరెడ్డి నగర్ రోడ్డు నెంబర్ 11 B బ్లాక్ లో వైఎస్సార్ వీరాభిమాని తెట్టెభావి ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్ వైఎస్సార్ విగ్రహానికి ఆయన పులమాల వేసి ఘన నివాళి అర్పించారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు.ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి వైఎస్సార్ చేసిన సేవలను ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి కొనియాడారు.ఈ జయంతి వేడుకలో ఈరెడ్డి దేవేందర్ రెడ్డి, చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి,ఆపాల వెంకట్ రెడ్డి,ఎడ్ల సంపత్ రెడ్డి,ఎడ్ల శ్యామ్ సుందర్ రెడ్డి,సురేందర్ రెడ్డి,రాజు,చందు డివిజన్ వాసులు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.