జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి వై జంక్షన్‌లలో ట్రాఫిక్ పరిస్థితులపై ఉన్నతాధికారుల సమీక్ష

July 8, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ | జూలై 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం దిశగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్-2 శేషాద్రి రెడ్డి, అదనపు డీసీపీ ట్రాఫిక్-2 వీరన్న, కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీ వెంకటయ్యతో కలిసి బుధవారం జేఎన్‌టీయూ జంక్షన్‌తో పాటు కూకట్‌పల్లి వై జంక్షన్‌ను ప్రత్యక్షంగా సందర్శించారు. ఈ సందర్భంగా రెండు ప్రధాన కూడళ్లలో నెలకొంటున్న ట్రాఫిక్ రద్దీ, వాహనాల రాకపోకలు, సిగ్నల్ నిర్వహణ, పీక్ అవర్స్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ సిబ్బంది నుంచి స్థానిక పరిస్థితులపై వివరాలు తెలుసుకుని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చేపట్టాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యలపై సమీక్ష నిర్వహించారు.వాహనదారులకు ఇబ్బందులు తగ్గేలా సిగ్నల్ వ్యవస్థలో అవసరమైన మార్పులు, ట్రాఫిక్ ప్రవాహాన్ని మరింత సులభతరం చేసే చర్యలు, సిబ్బంది సమర్థ వినియోగంపై అధికారులు పలు కీలక సూచనలు చేశారు. నగర ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ట్రాఫిక్ నిర్వహణలో మరింత సమర్థవంతమైన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper