ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జరిగిన సమావేశం
జనం న్యూస్ జులై 8 బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ప్రతినెల మొదటి మంగళవారం జరిగే ఆశా కార్యకర్తల సమావేశం ఈ రోజు బీబీపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ శిరీష గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ గారు మాట్లాడుతూ ఆసుపత్రిలో సురక్షిత కాన్పు అయిన తర్వాత గంటలోపే పుట్టిన నవజాత శిశువుకు తల్లిపాలు ( ముర్రుపాలు ) త్రాగించాలని అందుకు ప్రతి గర్భిణీ స్త్రీకి ముందునుంచే ఈ విషయం వివరించాలని ఆశలకు తెలియజేసి వాటియొక్క ప్రాముఖ్యతను వివరించారు.మరియు ఇది వర్షాకాలం సీజన్ కాబట్టి ప్రతీ గ్రామంలో ప్రతి మంగళవారం డ్రై గా ప్రతి శుక్రవారం కచ్చితంగా ఫ్రైడే డ్రైడే పాటించి పరిసరాల పరిశుభ్రత పాటించాలని గ్రామాల్లోని ఇంటింటికీ ప్రతి వ్యక్తికి ఈ విషయాన్ని తెలియజేయాలని సూచించారు. ఈ నెల 13 వ తేదీన నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం గురించి వివరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియ జేశారు. రోజువారీ అన్ని కార్యక్రమాలను చేయాలని చెప్పినారు.