ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

July 8, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూలై 08,అచ్యుతాపురం: దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా పూడిమడకలో వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షులు వాసుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మరియు అచ్యుతాపురం మండలం లోని పలు గ్రామాల్లో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.వైఎస్సార్ జయంతి వేడుకల్లో భాగంగా గ్రామ సచివాలయం పక్కనున్న వైయస్సార్ విగ్రహానికి వాసుపల్లి శ్రీనివాసరావు,చోడిపల్లి అప్పారావు,ఉమ్మిడి అప్పారావు,ఉమ్మిడి జగన్, చేపల శ్రీరాములు, మోసయ్యపేటలో చోడపల్లి వైస్సార్సీపీ గ్రామ అధ్యక్షుడు, అచ్యుతాపురం మండలం కాపు అధ్యక్షులు గెంజి రామకృష్ణ, సీనియర్ నాయకులు పితాని నాగేశ్వర రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అందరికీ స్వీట్లు మరియు పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఏరిపిల్లి భాను,జిల్లా ప్రసార కమిటీ కార్యదర్శి మేరుగు రాజేష్,సోషల్ మీడియా గనగళ్ళ కోడిందరావు, గ్రామ పంచాయతీ మాజీ వార్డు సభ్యులు,ఏరిపల్లి ముత్యాలు, పైడియ్య,వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు, లంకాడ శ్రీను,ఏరిపిల్లి రాజేష్, కొండల గణేష్,వాసుపల్లి సత్తిబాబు,మైలపల్లి పోలరాజు తదితరలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper