ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ

July 8, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ -జులై 8- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ కాలనీ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ కార్యక్రమం బుధవారం రోజున నిర్వహించారు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నకె సహదేవి టీచర్ వారి మామ వేల్పుల దేవదాస్, బావ వేల్పుల దాస్ జ్ఞాపకార్థమై పాఠశాలలోని విద్యార్థిని,విద్యార్థులకు మధ్యాహ్న భోజనము చేయుటకు ఉపయోగపడే విధంగా స్టీల్ ప్లేట్లు పంపిణీ చేశారు. కాంప్లెక్స్ హెచ్ఎం పి శేషు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా ఉపాధ్యాయులందరూ తమ వంతు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు,ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పి శేషు పాఠశాల ఉపాధ్యాయులు కే సహదేవి,ఎం ప్రసన్నకుమారి, డి నిర్మల కుమారి, శ్రీ చైతన్య మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper