బిసి గురుకుల ప్రిన్సిపాల్ మరియు విద్యార్థినుల కు రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు

May 12, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 12-05-26 మంగళవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు మహాత్మ జ్యోతిబాపూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరు ప్రిన్సిపాల్ మరియు విద్యార్థి నులకు రాష్ట బి సి సంక్షేమ శాఖ మంత్రి సవిత చేతుల మీదుగా సత్కారం జరగడ మైనది. 2025-26 విద్యా సంవత్సరం పదవ తరగతిలో మరియు ఇంటర్మీడియట్ నందు 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేసిన ప్రిన్సిపాల్ రామ కృష్ణారెడ్డి ను మరియు మంచి మార్కులు సంపాదించి ప్రతిభ కనబరిచిన ఓ.ప్రమీల,ఎ. చంద్ర కళ, ఎ.హారిక, ఎన్. పూజిత శ్రీ మరియు ఎ.లక్ష్మీ దేవీ లను ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగ తుల సంక్షేమశాఖ మంత్రి సవిత మరియు మహాత్మ జ్యోతిబా పూలే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు, విజయవాడ కార్యదర్శి మాధవి లత లను సత్కరించారు.

🌐 Select Language:
📰 ePaper