వేసవి వేళ చిన్నారుల ఈత సరదా
(జనం న్యూస్-మే 12 -కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) పాఠశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో మునగాల మండలంలోని సాగర్ ఎడమ కాల్వ చిన్నారులతో సందడి కనిపిస్తోంది. కృష్ణానగర్, నడిగూడెం గ్రామాల విద్యార్థులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో భద్రతా పరికరాలు ధరించి ఈత నేర్చుకుంటున్నారు.నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో సాయంత్రం వేళల్లో ఈ శిక్షణ సాగుతోంది.ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.