ఆక్వా రైతుల వెన్ను విరిచే కుట్ర
జనం న్యూస్ మే 13 అమలాపురం- మేత ధరలు పెంచితే చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం- రైతుల పట్ల ఇదేనా మీ తీరు?- వైసీపీ రాష్ట్ర సీ. ఈ.సీ. సభ్యులు పితాని బాలకృష్ణ విమర్శలు ముమ్మిడివరం: కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల వెన్ను విరిచే విధంగా వ్యవహరిస్తూ వారికి వెన్ను పోటు పొడుస్తోందని వై. ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ విమర్శించారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల గోడు పట్టించుకోకుండా వారిని దెబ్బ తీస్తుందని, తిరిగి ఆక్వా ఫీడ్ కి సంబంధించి రేట్లు చాలా విపరీతంగా పెంచి ఆక్వారైతును ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. పెంచిన రొయ్యల, చేపల మేత ధరలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం పెంచిన ధరలు తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో 2019 నుండి 2023 జగన్మోహన్ రెడ్డి వారు పరిపాలనలో మూడుసార్లు ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచితే ఆ పెంచిన రేట్లను పూర్తిగా తగ్గించే లాగా శ్రీ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే డీజిల్ దొరక్క, కరెంటు రేట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి ఇప్పుడు ఫీడ్ రేట్లు పెంచడం తీవ్ర ఇక్కట్లు పాలవుతారని ఆయన అన్నారు. ఈ ఫీడ్ కంపెనీలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినవారే అని వారితో మాట్లాడి తక్షణం ఈ పెంచిన రేట్లు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని వైయస్సార్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ పితాని బాలకృష్ణ చేశారు.