విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసినందుకు విద్యా వారోత్సవాల పేరుతో సంబరాలా
జనం న్యూస్ 13 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేసినందుకు సంబరాలా ఫీజు రియింబర్స్ మెంట్ ఇవ్వకుండగా మోసం చేసినందుకా సంబరాలు విద్య వారోత్సవాల పేరుతో సంబరాలు చేయడానికి సిగ్గు అనిపిస్తే లేదా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య రాష్ట్రంలో విద్యార్థి నాయకులను నిర్బంధించి విద్యా వారోత్సవాల పేరుతో సంబరాల ఈ సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ దేనికోసం ఎల్బీస్టేడియం లో విద్యా వారోత్సవాల సంబరాలు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నా విద్యార్థులకు ఏం ఎలగబెట్టారని విద్య వార్షికోత్సవాలు చేస్తా ఉన్నది ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ రాలే. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాలే పదో తరగతి పాసైన విద్యార్థులకు పదివేల రూపాయలు రాలే ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు 15వేల రూపాయలు రాలే డిగ్రీ పాసైన విద్యార్థులకు 25 వేల రూపాయలు రాలే పీజీ పాసైన విద్యార్థులకు లక్ష రూపాయలు రాలే పిహెచ్డి చేసిన స్కాలర్స్ కి 5 లక్షల రూపాయలు రాలే మహిళ విద్యార్థులకు స్కూటీలు రాలే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు రాలే జాబ్ క్యాలెండర్ లేదుపేద విద్యార్థులు చదువుకునే గురుకులలాను పట్టించుకొనే పరిస్థితి లేదు కార్పొరేట్ విద్యా మీద ఉన్నంత సోయి, ప్రభుత్వ బడులపైన ప్రభుత్వ విద్య పైన లేదు రాష్ట్రములో ప్రభుత్వ బడులను గాలికి వదిలేసి కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే గురుకులాల్లో దాదాపు 100 కీ పైగా విద్యార్థులు వివిధ కారణాలతో మరణిస్తే కనీసం వారి తల్లితండ్రులను పట్టించుకునే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన విష ఆహరం తిని 1200 వందలకు పైన విద్యార్థులు ఆసుపత్రులు పాలైతే ముఖ్యమంత్రి కి కనీసం సమీక్షా నిర్వహించాలనే సోయిలేదు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి విద్యా రంగంపై కనీసం సోయలేదు సంబురాల పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనంతో వృధా చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువుకు దూరం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు అని మండిపడ్డారు ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్వి నాయకులు మహేష్ నరసింహ మోహన్ బాబు గోవింద్ కృష్ణ చందు నాయక్ సీను నాయక్ బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు