జిల్లా యస్ సి యస్ టి విజిలెన్స్& మానటరింగ్ కమిటీ ఎంపిక లో సామాజిక న్యాయం ఎక్కడా ?
జనం న్యూస్ 13 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ పట్టణంలోని మెజారిటీ యస్ సి మాదిగలకు యస్ టి ల కు అన్యాయం జోగులాంబ గద్వాల జిల్లా యస్ సి యస్ టి విజిలెన్స్ &మానటరింగ్ కమిటీ కి అలంపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికైన.1.డి . నర్సింహులు మాదిగ 2.భూక్య శైలజ హర్ష వర్ధన్ రెడ్డి 3.మళ్ళీ కార్జున్ మాల పాదాదర్శకంగా ఎంపిక చేసిన అధికారులకు, సిఫార్సు చేసిన నాయకులకు ధన్యావాదాలు సిఫార్సు చేసిన నాయకుల్లారా ఎంపిక చేసిన అధికారుల్లారా ఐజ పట్టణం లో 5000లు పై బడి జనాభా కలిగిన మెజారిటీ మాదిగ సామాజిక వర్గం లో ఒక్కరు కూడా ఇట్టి యస్ సి యస్ టి కమిటీ కి అర్హులు దొరకలేదా అలాగే.ఐజ పట్టణం లో మెజారిటీ యస్ టిసామాజిక వర్గం నుండి ఎందుకు ఎంపిక చెయ్యకుండా ఒక్కరు తప్పితే.మరొకరు లేని లంబాడి సామాజిక వర్గం నుండి ఎంపిక చెయ్యడం ఎంత వరకు కరెక్ట్ అదికూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నీ పెళ్లి చేసుకొన్నా అమ్మాయి నీ ఎంపిక చెయ్యడం ఏమిటి ఆమె తప్పితే యస్ టి సామాజిక వర్గం లో ఒక్క మహిళ కూడా లేదా ఆమె అగ్రకుల సామాజిక వర్గాన్ని కాదని ఎంత వరకు అణగారిన వర్గాలైన యస్ సి యస్ యస్ టి లపక్షాన గోంతేత్తి మాట్లాడుతుంది ఒక వేళ తమరు మాదిగ మాల కాకుండా యస్ టి సామాజిక వర్గం నుండి తీసుకొన్నాం అనీ మీరు భావిస్తే మెజారిటీ వర్గాల ను ఎందుకు విస్మరించారు భారత రాజ్యాంగం ప్రకారం జనాభా ధమాషా ప్రకారం ఎంపిక చెయ్యాలి కదా నిజంగా సామాజిక న్యాయం పాటిస్తే అలంపూర్ నియోజకవర్గం లోనే అత్యధికంగా మాదిగ జనాభా కలిగింది ఐజ పట్టణం లో.మరి ఇక్కడ మాదిగల ను ఎందుకు ఎంపిక చెయ్యలేదు. అలాగే మాల సామాజిక వర్గం కొంత ఎక్కువ జనాభా కలిగినది అలంపూర్ పట్టణంలో అక్కడ మాల ను ఎందుకు ఎంపిక చెయ్యలేదు మాదిగలు అత్యధికంగా ఉన్నా ఐజ పట్టణం నుండి మాదిగ లకు అవకాశం ఇవ్వకుండా మాల సామాజిక వర్గం నుండి ఎంపిక చెయ్యడం ఎంత వరకు కరెక్ట్ ఇదీ ముమ్మాటికీ ఐజ పట్టణం లోని చైతన్య వంతమైన మాదిగలు కు అవకాశం లేకుండా చెయ్యాలనే కుట్ర పూరిత ధోరణి తో సిఫార్సు చేసే నాయకుడును ఐజ పట్టణం లోని *కొందరు తప్పు దోవ పట్టించారని స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మెజారిటీ సామాజిక వర్గాల కు అవకాశం లేకుండా అగ్రకుల ఇంటి కోడలు కు అవకాశం ఇవ్వడమే ఇందుకు నిదర్శనం ఏదీ ఏమైనా యస్ సి నియోజకవర్గం లోనే మాదిగల కు అన్యాయం జరగడం,సిగ్గు చేటు దయచేసి ఇట్టి విషయం లో మాదిగ సామాజిక వర్గ నీకి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు పునరాలోచన చేసి ఐజ పట్టణం లో నీ మాదిగలకు అవకాశం కోసం మీ మీ నాయకుడి పై ఒత్తిడి చెయ్యండి.వి. రాజు మాదిగ ఐజ యం యస్ పి జిల్లా కన్వీనర్ యం ఆర్ పి యస్ జిల్లా మాజీ అధ్యక్షులు