మంగళగిరిలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్

July 8, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 8 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)మంగళగిరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో “ప్రజా దర్బార్” ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఘనంగా జరిగింది.రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా విన్నవించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరి వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలను అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.విద్య, వైద్యం, రోడ్లు, పెన్షన్లు, రేషన్ వంటి వివిధ అంశాలపై ప్రజలు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందించారు. ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా ఉంటుందని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ప్రజాస్వామ్య కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లను పార్టీ నాయకులు పరిరక్షించారు

🌐 Select Language:
📰 ePaper