యువమోర్చ ఆధ్వర్యంలో ఘనంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ సంస్కరణ పక్షోత్సవాలు
జనం న్యూస్ జూలై 8 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువమోర్చ అధ్యక్షులు గణాల రాజ రాజేశ్వర కళ్యాణ్ ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణ స్థానిక మోడరన్ కళాశాల లో నిర్వహించిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125 వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విద్యార్థుల సమావేశం కి ముఖ్య వక్తగా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ వ్యవహరించి… ముఖర్జీ జీవిత విశేషాలు, వారు సాధించిన విజయాలు విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమం లో పార్టీ సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు,యువమోర్చ ప్రధాన కార్యదర్శి తోలేటి సూర్య గంగాధర్,పట్టణ అధ్యక్షులు దునే శ్రీను, రూరల్ మండల అధ్యక్షులు ఆకేటి శ్రీ కృష్ణ,జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు ఛటర్తి రాంబాబు, మైనార్టీ మోర్చా ఉపాధ్యక్షులు షేక్ అన్వర్ బాషా,జిల్లా కార్యదర్శి రమావర్మ,పట్టణ ప్రధాన కార్యదర్శి కృష్ణ మూర్తి,జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్టువాడ హరిబాబు, మోడరన్ కాలేజీ అధినేత లయన్ జివి రావు, కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.