బాలికల హాస్టల్ లో, నీటి కొరత

July 13, 2026 | తెలంగాణ

జనం న్యూస్ , 2026, జూలై 13, అల్లాపూర్ గ్రామం, రాయికోడ్ మండలం, సంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి జిల్లా,అందోల్ నియోజకవర్గం, రాయికోడ్ మండలంలోని, అల్లాపూర్ గ్రామ శివారులో గల, తెలంగాణ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ, గురుకుల, బాలికల ఆశ్రమ పాఠశాలలో, నీటి కొరత ఏర్పడింది. రెండవ శనివారం సందర్భంగా, పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులను, పాఠశాలలోకి, అనుమతించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాలలోకి వెళ్లి చూడగా, రంగు మారిన, రుచి లేని, నీటినే, విద్యార్థినీలు, త్రాగుచున్నారని గమనించిన తల్లిదండ్రులు, ఆ నీటిని తీసుకొని, ప్రిన్సిపల్ కు చూపించి, కొన్ని హాస్టల్ లలో కలుషిత ఆహారం తిని, విద్యార్థిని, విద్యార్థులు అనారోగ్యానికి గురి అయ్యారని, మెనూ ప్రకారం ఆహారం అందించాలని కోరగా, ప్రిన్సిపల్ ఆవేశంతో, మీరు మద్యం సేవించి మాట్లాడుతున్నారని, తల్లిదండ్రులను అవమానపరిచారని, ఈ విధంగా మాట్లాడడం గురుకులానికే అవమానకరమని, విద్యార్థి నీలకు, చదువుతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని పేరెంట్స్ తెలిపారు .ప్రభుత్వ అధికారులు స్పందించి, మంచినీటి కొరతను తీర్చి, మెనూ ప్రకారం భోజనం అందేలా చూడాలని, ప్రతి నెల అన్ని ఆశ్రమ పాఠశాలలు, మరియు కళాశాలలలో, పేరెంట్స్ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని, వారు కోరారు.

🌐 Select Language:
📰 ePaper