తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కామగల్ల నరేష్ నియామకం
జనం న్యూస్ సంగారెడ్డి, జూలై 13:తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TYJF) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కామగల్ల నరేష్‌ను నియమించారు. TYJF రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు గారు ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు సంస్థ నాయకులు తెలిపారు.సంస్థ బలోపేతం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, యువ జర్నలిస్టుల అభివృద్ధి కోసం కృషి చేయగల నాయకత్వ లక్షణాలను గుర్తించి కామగల్ల నరేష్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.ఈ నియామక కార్యక్రమం TYJF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు కామగల్ల నరేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులుతనుగుల జితేందర్ రావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.