వనపర్తి జిల్లా ఆర్య వైశ్య సంఘం కోశాధికారిగా బుస్స రమేష్.

July 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు జులై 14-07-2026 మంగళవారం వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికైన తాను బుధవారం వనపర్తి లో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయ నున్నట్లు ఆయన తెలిపారు. వనపర్తి దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో బుధవారం జరిగే జిల్లా, మండల కమిటీల ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని రమేష్ తెలిపారు. జిల్లా కోశాధికారిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న వనపర్తి జిల్లా ఆర్య వైశ్య సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఆర్యవైశ్యుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రమేష్ చెప్పారు.

🌐 Select Language:
📰 ePaper