పెబ్బేరు అమాలి సంఘం కార్యాలయంలో జులై 14న చలో హైదరాబాద్ కరపత్రం విడుదల చేసిన సిపిఎం నాయకులు.

July 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జులై 14-07-2026 మంగళవారం ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని జులై 15న హైదరాబాదులో ఇందిరాపార్క్ లో జరుగు మహా ధర్నాకు వందలాదిగా తరలి రావాలని కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ్ల రాజు సిపిఎం మాజీ ఎంపీటీసీ కార్యదర్శి జి బాలయ్య మాట్లాడుతూ ” ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగ హామీని కేంద్ర బీజేపీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని,పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసి భర్తీ చేయాలని,డీఎస్సీ, జేఎల్,డిఎల్,గ్రూప్ 1, 2,3, 4 లతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఊసన్న హమాలీ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు నాయకులు పెద్ద మన్యం మహేష్ పెద్ద నరసింహ చెన్నయ్య సురేష్ శివాజీ మహేందర్ అంజి తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper