పెద్ద తడ్గుర్, సోమూర్ గ్రామాల BLOలను అభినందించిన అదనపు కలెక్టర్ వి. విక్టర్

July 14, 2026 | తెలంగాణ

మద్నూర్, జూలై 14 జనం న్యూస్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – SIR ప్రక్రియను మద్నూర్ మండలంలోని పెద్ద తడ్గుర్, సోమూర్ గ్రామాలలో ముందుగా 100% పూర్తి చేసిన బూత్ లెవెల్ అధికారులను జుక్కల్ ERO & అదనపు కలెక్టర్ వి. విక్టర్ గారు సోమవారం సన్మానించారు.ఈ సందర్భంగా పెద్ద తడ్గుర్ గ్రామ BLO యాదవ్ రావు, సోమూర్ గ్రామ BLO గుండ రంజిత్ లను శాలువాతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో అత్యంత కష్టపడి పనిచేసి లక్ష్యాన్ని సాధించినందుకు వారిని అభినందించారు.అంతకు ముందు అదనపు కలెక్టర్ వి. విక్టర్ గారు పెద్ద తాడ్గుర్, చిన్న తాడ్గుర్ గ్రామాలలో BLOలు చేస్తున్న SIR ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంటింటికి వెళ్లి ఫారాలు సేకరించడం, అర్హులైన వారి పేర్లు నమోదు చేయడం, తప్పులు సరిచేయడం వంటి అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “SIR ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా 100% కవరేజ్ సాధించాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకాలంలో పని పూర్తి చేయాలి” అని BLOలకు సూచించారు.ఈ కార్యక్రమంలో మద్నూర్ తహసీల్దార్ ఎం డి ముజీబ్ , ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, పెద్ద తడ్గుర్ గ్రామ సర్పంచ్ ఈరన్న, చిన్న తాడ్గుర్ సర్పంచ్ ప్రకాష్, గ్రామ పెద్దలు గంగాధర్, మండల రెవెన్యూ అధికారులు శివ రామకృష్ణ, గిర్దావర్ మురళిధర్, రవి కుమార్, బాలరాజు, , నర్సింలు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper