తక్షణమే సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి

July 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 15 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కి ఫిర్యాదు బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీశ్ రావు మరియు బీఆర్‌ఎస్ నాయకులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద, అన్‌-పార్లమెంటరీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు రైతుల తో కలిసి అలంపూర్ నియోజకవర్గం ఐజ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకుల ను కోసి వారి రక్తాన్ని పంటల మీద చల్లితే అవే పండుతాయి అంటూ హింసను ప్రేరేపించేలా రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై భారతీయ న్యాయ సంహిత (బి యస్ యన్ ) 2023 కింద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేసారు.రైతులకు నీళ్లు ఇవ్వండి అని అడిగిన పాపానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్దేశించి వాళ్లను కోసి పంట పొలాలకు వాళ్ళ రక్తమును చల్లితే అవే పండుతాయి అని దుర్మార్గమైన నరహంతక భాషలో మాట్లాడడం సిగ్గుచేటు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం సిగ్గుపడుతున్నామని అన్నారుఆంధ్రప్రదేశ్ కేమో నీళ్లు తెలంగాణకేమో కన్నీళ్లురేవంత్ రెడ్డి రక్తం మరిగిన రక్త పిశాచి లాగా వ్యవహరించడం చాలా బాధాకరం ఇవాళ మీరిచ్చిన హామీలు 6 గ్యారెంటీలు 420 లను అమలు చేయండి అని మేము అడుగుతా ఉంటే ప్రతిపక్ష నాయకుల పైన అడ్డమైన మాటలు మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప అభివృద్ధి శూన్యం అని అన్నారు ఈ రాష్ట్రంలో ఈరోజు రైతుల పైన ఉరితాలు విద్యార్థులకు ఫీజు నెంబర్స్ మెంట్ లేకుండా మోసం నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్త చేయకుండా జీవితాలతో చెలగాటం ఆడుతూ నరహంతక భాషలో మాట్లాడుతుంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంగా తక్షణమే ఆయన పైన కఠినమైన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోఆప్షన్ సభ్యులు మౌలా అంజి అశ్వ పెద్దయ్య, బైనపల్లి మైబు నరేష్ వీరేష్, రాజు రజక్ గంగన్న చిన్న ఆటో వెంకట రాములు ఎండి మైబు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper