వల్భాపూర్‌లో ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన
జనం న్యూస్ జులై 16 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని వల్భాపూర్ గ్రామంలో ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఆధ్వర్యంలో గురువారం ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా డాక్టర్ రాజశేఖర్ మేడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఎల్కతుర్తి పీహెచ్‌సీని లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు.గ్రామంలో పారిశుద్ధ్యాన్ని పాటించడం, స్వచ్ఛమైన తాగునీటిని వినియోగించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని డాక్టర్ రాజశేఖర్ మేడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్,శ్వేత ఉపసర్పంచ్ అనిల్, వార్డు సభ్యులు,ఎ ఎన్ ఎం మమత ఆశా కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేసిన వైద్య సిబ్బందిని గ్రామ ప్రజలు అభినందించారు