శ్రీ శ్రీ మూసాపేట్ నల్ల పోచమ్మ దేవస్థానం బోనాల మహోత్సవానికి బండి రమేష్‌కు ఆహ్వానం

July 22, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూసాపేట్: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా శ్రీ శ్రీ నల్ల పోచమ్మ దేవస్థానంలో ఆగస్టు 6న నిర్వహించనున్న బోనాల మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బండి రమేష్‌ను దేవస్థానం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ రాచమల్ల భిక్షపతి గౌడ్, ఈవో మాణిక్ ప్రభు, దేవస్థానం కమిటీ సభ్యులు బండి రమేష్‌కు ఆహ్వాన పత్రికను అందజేసి, బోనాల మహోత్సవానికి విచ్చేసి అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆశీస్సులు పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బీ-బ్లాక్ అధ్యక్షుడు తూము వేణు, మూసాపేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూము సంతోష్, కేబుల్ శ్రీనివాస్, రాచమల్ల శేఖర్ గౌడ్, కావలి పాండు ముదిరాజ్, మామిళ్ల రమేష్ యాదవ్, పెరుమాండ్ల నర్సింగరావు, రఘుపతి రెడ్డి, గురురాజ్ పంతులు, తోట రాజు, జైపాల్ సాయి తదితరులు పాల్గొన్నారు.బోనాల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ప్రతినిధులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపాశీస్సులు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.

🌐 Select Language:
📰 ePaper