జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి- టియుడబ్ల్యూజే(ఐజేయు)
నాగార్జునసాగర్ లో సభ్యత్వ నమోదు
జనం న్యూస్- మే 14- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ లోని విజయ విహార్ అతిథిగృహంలో గురువారం నాడు టియుడబ్ల్యూజే (ఐజేయు)సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్టుల వృత్తి నిర్వహణ రోజురోజుకు సంక్లిష్టమవుతున్న దశలో అనేక ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అని సమస్యలను పరిష్కరించేందుకు అనివార్యంగా జర్నలిస్టులందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని . జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘకాలంగా పోరాడుతూ అనేక సత్ఫలితాలను, విజయాలను సాధించిన జర్నలిస్టుల సంఘం టియుడబ్ల్యూజే (ఐజేయు) మండల స్థాయి నుండి, మున్సిపల్, డివిజన్ స్థాయి, జిల్లాస్థాయి , రాష్ట్ర శాఖలో కలుపుకొని జాతీయస్థాయిలోనే అతిపెద్ద సంఘంగా విస్తరించి గ్రామీణ ప్రాంత విలేకరుల అక్రిడేషన్ సౌకర్యం మరియు బస్సు పాసులు, ఇండ్ల మరియు ఇండ్ల స్థలాల కోసం , జర్నలిస్టుల సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొనే దిశగా టియుడబ్ల్యూజే (ఐ జె యు) నిరంతరం విలేకరుల పక్షాన పోరాటం చేస్తుంది అని అన్నారు, గురువారం నాడు నాగార్జునసాగర్ లోని విజయ విహార్ అతిథిగృహంలో నిర్వహించిన సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పలువురు విలేకరులు హాజరై సభ్యత్వాన్ని స్వీకరించారు, ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, స్థానిక పాత్రికేయులు పాకాల నరసింహ, చెరుకుపల్లి రాజు, గోరంట్ల శివరాం ప్రసాద్, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.