వి హనుమంత్ రావు నీ కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్ర బీసీ నాయకులు

May 14, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ : బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం మంత్రివర్గ హోదాతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంత రావు ని డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, రాష్ట్ర బీసీ నాయకులు పోతుల రాజేందర్ పటేల్, రాకేష్ పటేల్. నరేందర్ రెడ్డి, ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ బీసీ సమాజానికి దశాబ్దాలుగా అండగా నిలిచిన హనుమంత రావు అనుభవం, పోరాటం ఈ కొత్త బాధ్యతలో బీసీల అభివృద్ధికి మరింత ఊతమివ్వాలని ఆకాంక్షిస్తున్నాం. ఆయన సేవలు, సలహాలు తెలంగాణ బీసీల ఆత్మగౌరవాన్ని, సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాం.

🌐 Select Language:
📰 ePaper