తొలి ఏకాదశిని పురస్కరించుకుని సుబ్బలమ్మ అమ్మవారి దర్శించుకున్న బిజెపి నాయకులు
జనం న్యూస్ జూలై 25 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా* అమలాపురం :* తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా అమలాపురంలోని ప్రసిద్ధ సుబ్బలమ్మ అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గనిసెట్టి అరవింద్, సుబ్బలమ్మ తల్లి గుడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు అప్పన వీరన్న, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెద్దిరెడ్డి పుల్లయ్య నాయుడు పాల్గొన్నారు.అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులను కోరారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మొక్కుకున్నారు.ఈ సందర్భంగా ఆలయం భక్తి శ్రద్ధలతో నిండిపోయింది. మహిళలు, భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు.