డ్రామా ఆర్టిస్టుగా మారిన గద్వాల ఎమ్మెల్యే

July 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 29 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా ఎమ్మెల్యే అంతా డ్రామా ఆర్టిస్టుగా తయారైనాడు డబుల్ బెడ్ రూములు ఏమయ్యాయి పదేళ్లు బి ఆర్ యస్ లో ఉండి ఏమి అభివృద్ధి చేసారు బి ఆర్ యస్ లో గెలిచి అబివృద్ధి కోసం అని కాంగ్రెస్ లో చేరి ఏమి చేశారు 12 ఏళ్ల నుండి ఎందుకు గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి చేయలేదు 12 ఏళ్ళ నుండి గుర్రం గడ్డ బ్రిడ్జి ఏమైంది పేదవారి ఇంటి స్థలాలు లాక్కొని వాళ్ళకి గూడు లేకుండ చేసారు.అధ్వానంగా మారిన రోడ్లు డి కె.అరుణమ్మ నెట్టెంపాడు ప్రాజెక్టు ను సాధించి, నీళ్లు ఇచ్చారు. ఆ కాలువలలో జమ్మూ మొలుస్తుంది నీళ్ళు రావు అని మీరు విమర్శించారు. ఈరోజు వరకు మిగిలిన పనులు పూర్తి చేయరు పట్టించుకోరు గద్వాల ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నాడు, ఏ ప్రభుత్వంతో కొట్లాడాలి అంటున్నాడు.సిట్టింగ్ ఎమ్మెల్యే, గెలిచింది బీఆర్ఎస్ టికెటు మళ్ళీ అభివృద్ధి కోసం పోతున్నా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పోయినాడు. అభివృద్ధి కోసం పోయిన ఎమ్మెల్యే జిల్లా లో చాలా సమస్యలున్నాయి ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు రోడ్లు విద్యుత్ సమస్యలు ఉన్నాయి. ఒక్క ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా సొంతంగా నీకు అంతా సత్తా కూడా లేని చేతగాని ఎమ్మెల్యేవాఅంటే సొంత పార్టీ మీద ధర్నాకు దిగుతే నేనేదో ప్రజల కోసం కొట్లాడుతున్నా అని చూపించు కోవడానికి తప్పితే అసలు ఇన్ని రోజులు నువ్వేమి చేస్తున్నావుఎగువ రాష్ట్రం లో వర్షాలు పడి అప్పటికే రిజర్వాయర్లలో నీళ్లు ఉన్నాయి. అసలు ఉన్న నీళ్లను సరిగ్గా ఉపయోగంచు కొనే ఆలోచన కెపాసిటీ లేని ఎమ్మెల్యేవి నువ్వు ఈరోజు ప్రజల ముందరకు వచ్చి నాటకాలు చేస్తున్నావు.నేను ధర్నా చేస్తా, రైతుల కోసం ధర్నా చేస్తా.ఇవన్నీ నాటకాలు బంద్ చేసి ఇప్పుడు నీళ్లు సరిగ్గా వదలలేదు. బిఆర్ఎస్ హయం లో నీళ్ల సమస్యలు ఉన్నాయి రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచినా ఒక్క కాలువ పని చేసింది లేదు.. అసలు కాల్వలో జమ్ము తీయలేదు ఇప్పటివరకు ఒక్క పని చేసింది లేదు ..ఈరోజు కూడా రైతుల గురించి మాట్లాడకపోతే గ్రామంలో ఉరికించి కొడతారని భయంతో ఈ నాటకాలకు తెర లేపావు.. కానీ ప్రజల మీద ప్రేమతో కాదు, నీ పదవి కోసం చేస్తున్నావు
ఇవన్నీ నాటకాలు మానుకో ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఇంకా గద్వాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ రోడ్ల సమస్యలు ఇన్నేళ్లలో కొత్త రోడ్డు వేసింది లేదు. ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు కాల్వాలు మెంటైన్ లేవు, నీళ్లు సరిగ్గా వస్తలేవు ఒక్క పని చేయలేకుండా ఒక చేతగాని ఎమ్మెల్యేవి ఈరోజు సొంత ప్రభుత్వం లో ఉన్న నీళ్లు తెప్పించుకోలేని పరిస్థితి ఉన్నదని అని అన్నారు డికె.స్నిగ్ద రెడ్డి బిజెపి జిల్లా యువ నాయకురాలు

🌐 Select Language:
📰 ePaper