లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు

July 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్: జూలై 30 గురువారం:సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్: పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ జి. బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట ఆధ్వర్యంలో గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభయజ్యోతి మనోవికాస కేంద్రంలో అల్పాహార కార్యక్రమం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, లార్డ్స్ అనాథ ఆశ్రమంలో అన్నప్రసాద పంపిణీ, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలకు అన్నప్రసాద వితరణ, అలాగే అభయజ్యోతి కేంద్ర సిబ్బంది కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లగిశెట్టి నరసింహులు మాట్లాడుతూ, సమాజ సేవే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని, నిరంతరం ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి మ్యాద శ్రీధర్, ట్రెజరర్ బాసం శ్రీనివాస్, పాస్ట్ గవర్నర్ గంప రమేష్, డిస్ట్రిక్ట్ చైర్‌పర్సన్ జ్యోజి లియో సభ్యులు కార్తీక్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper