పెట్టుబడి పెడదాం రండి..
భవిష్యత్ బంగారంగా మార్చుకుందాం
జనం న్యూస్, తేదీ మే 16 జహీరాబాద్ ప్రాంతం: పేద, మధ్యతరగతి, రియల్ ఎస్టేట్వ్యాపారులు పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు. ఎక్కడ పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు ఉంటాయోనని భావిస్తూ, ఆ ప్రాంతాల్లో భూమి, ఇల్లు లేదా ఇంటి స్థలాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దు జహీరాబాద్ (నిమ్స్) పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా నిలయంగా మారింది. ముఖ్యంగా చిన్న, మధ్యతరగతి కుటుంబాలు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 2013లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలో పెట్టుబడులు ఆకర్షించడానికి, పరిశ్రమల ఉత్పాదకతను పెంచడానికి స్థానిక యువతకు ఉ పాధి కల్పించడానికి నిన్జ్ (జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలి) ప్రాజెక్టును ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 13 నిమ్స్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు ఒకటి మంజూరు చేసింది. వివిధ పరిశ్రమల స్థాపన కోసం ఝరాసంగం, న్యాల్ కల్ మండలంలోని 17 గ్రామాలలో సుమారుగా 12,635 ఎకరాల భూమి సేకరించి 2 లక్షల 50 వేల మందికి ప్రత్యక్షంగా 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదించింది. ఇప్పటివరకు ఝరాసంగం మండలంలో బర్దిపూర్, ఎల్గోయి, చిల్లపల్లి, చిల్లపల్లి తండా, న్యాల్ కాల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో సుమారుగా 10 వేల ఎకరాల వరకు సేకరించినట్లు అధికారికంగా ప్రకటించారు. సేకరించిన భూమిని 45 రోజుల్లోపు ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ హద్దు రాళ్లను వేస్తున్నారు. నిస్ట్ ప్రాంతానికి ప్రత్యేక రహదారి……నిమ్డ్ పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లేందుకు హుగ్గెల్లి 65 వ జాతీయ రహదారి నుండి ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామ శివారు వరకు సుమారుగా 9 కిలోమీటర్లురోడ్డు మార్గాన్ని రూ.100 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. నిర్మాణం పూర్తయిన రోడ్డు మార్గాన్ని గత సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. మౌలిక వసతుల కల్పనలో ముందుకు…….మొదటి విడతగా సేకరించిన భూముల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వ వాటా 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టనున్నారు. దాదాపు రూ.2,369 కోట్ల వ్యయంతో నిమ్ ప్రాజెక్టు కోసం మొదటి విడతగా సేకరించిన 3,245 ఎకరాల భూముల్లో రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి అమలు ట్రస్ట్ కలిసి పారిశ్రామిక అభివృద్ధి పనులు చేపట్టనున్నాయి వేగంగా స్మార్ట్ సిటీ పనులు……కేంద్ర ప్రభుత్వం 2024లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా జహీరాబాద్‌ను ప్రకటించడంతో నిమ్స్ పనులు ఊపందుకున్నాయి. రూ 2,369. కోట్లతో హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా ఝరాసంగం, న్యాల్ కల్ మండలాల్లోని గ్రామాల పరిధిలో లే- అవుట్ అభివృద్ధి, అంతర్జాల సౌకర్యం, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, పార్కులు తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థలకు ఆహ్వానం అందించగా కొన్ని సంస్థలు టెండర్లను దక్కించుకున్నాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనులు ప్రారంభించాయి. మొదటి విడత మౌలిక వసతుల కల్పనలో భాగంగా బర్దిపూర్, చిలేపల్లి, చిలేపల్లి తండా, ఎల్గోయి గ్రామాల నిమ్ద్ వివిధ పరిశ్రమల కోసం సేకరించిన 3,245 ఎకరాలలో మౌలిక వసతుల్లో భాగంగా రోడ్లు, విద్యుత్, బ్రిడ్జిలు, కాలువలు, వంతెనలు, మంచినీటి సరఫరా, టెండర్లను ఆహ్వానించగా హైదరాబాద్‌కు చెందిన ఎస్ఆర్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్లను దక్కించుకుంది.దీంతో రూ.596.61 కోట్ల వ్యయంతో స్మార్ట్ సిటీ మౌలిక సదుపాయాలను సంస్థ త్వరలో అధికారికంగా పనులు చేపట్టనున్నట్లు తెలిసింది.పలు పరిశ్రమలకు భూముల కేటాయింపు….నిమ్స్ పరిశ్రమల స్థాపన కోసం ముందుకు వచ్చిన పలు పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ఈవీఎం టెక్నాలజీ సంస్థకు 511 ఎకరాలు కేటాయించింది. ఈ సంస్థ రూ. వేయి కోట్ల రూపాయలతో పరిశ్రమలు స్థాపించనున్నది. ఈ సంస్థ కు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే శంకుస్థాపన చేసింది. భారీ ప్రహరీ గోడ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. హ్యుందాయ్ మోటార్ కంపెనీ (ఈవీ ఆటోమోటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) కంపెనీకి 675 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించగా ఈ సంస్థ సుమారుగా రూ. 8,528 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఇటీవలనే స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 4,276 మంది స్థానిక యువతకు ప్రత్యక్ష ఉ పాధిని కల్పిస్తుందని భావిస్తున్నారు. త్వరలో ఈ కంపెనీకి సంబంధించి శంకుస్థాపన జోరుగా ప్రచారం కొనసాగుతుంది.సరిహద్దులు సంపన్నం…..నిష్ట ప్రాంతానికి సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పెట్టుబడిదారులు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చిన్న పేద మధ్యతరగతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రాంతంలో పెట్టు బడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట్, పటాన్ చెరువు, కర్ణాటకలోని మన్నెకెళ్లి, బీదర్, చించోలి, కుంచారం, తదితర ప్రాంతాలలో నిష్ణా సరిహద్దు ప్రాంతాలుగా అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పలు వెంచర్లను, భూములను కొనుగోలు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉంటాయని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.