నిబద్ధతకు నిలువుటెత్తు రూపం ఇన్యాసమ్మ

August 1, 2026 | తెలంగాణ

నాలుగు దశాబ్దాలకు పైగా ఇన్యాసమ్మ సేవలు చిరస్మరణీయం

పెద్దవూర మండల విద్యాశాఖ అధికారి తరి రాము

పాఠశాలలో రికార్డ్ అసిస్టెంట్ ఇన్యాసమ్మ పదవీ విరమణ

భావోద్వేగ వాతావరణంలో ఇన్యాసమ్మ పదవీ విరమణోత్సవం

జనం న్యూస్- ఆగస్టు 1- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో సుదీర్ఘకాలం పాటు సేవలందించి న రికార్డ్ అసిస్టెంట్ ఇన్యాసమ్మ పదవీ విరమణోత్సవం శనివారం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం భావోద్వేగ వాతావరణం మధ్య అభినందనల వేదికగా మారింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దవూర మండల విద్యాశాఖ అధికారి తరి రాము,తిరుమలగిరి సాగర్ విద్యాశాఖ అధికారి శ్రీను పాల్గొని శాలువాతో ఘనంగా సన్మానించి,పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ,ప్రైవేట్ రంగాలలో ఏదైనా ఉద్యోగంలో సుదీర్ఘకాలం పాటు ఒకే నిబద్ధతతో పనిచేయడం అంత సులభం కాదు అని కానీ ఇన్యాసమ్మ సుమారు 42 సంవత్సరాల సుదీర్ఘ సేవా కాలంలో ఏనాడు విధుల్లో అలసట ప్రదర్శించ కుండా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పాఠశాల అభివృద్ధిలో పాలుపంచుకున్నారని అన్నారు,విద్యార్థుల ప్రగతిలో సిబ్బంది పాత్రఎంత ముఖ్యమో ఇన్యాసమ్మ పనితీరు నిరూపించింది అని ఉద్యోగ విరమణ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు,
ఈ వేడుకకు అధ్యక్షత వహించిన పాఠశాలప్రధానోపాధ్యాయులు సిస్టర్ లలిత మాట్లాడుతూమా పాఠశాలలో గత నాలుగు దశాబ్దాలకు పైగా ఒక కుటుంబ సభ్యురాలిగా ఇన్యాసమ్మ సేవలు అందించడం మాఅందరికీ గర్వకారణం అని పాఠశాలకు సంబంధించిన ప్రతీ రికార్డును పనులను ఎంతో నిజాయితీతో,బాధ్యతగా పూర్తి చేసేవారని వారి సేవలను పాఠశాల యాజమాన్యం ఎప్పటికీ మరువలేదనివారు చూపిన అంకితభావం రాబోయే తరాలకు,తోటి సిబ్బందికి ఎంతో ఆదర్శప్రాయం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఎంతగానో అలరించాయి,ఈ వీడ్కోలు కార్యక్రమంలోకుర్మారెడ్డి,పైలాన్ కాలనీ ప్రభుత్వ మోడల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శేషు,పాఠశాల ఉపాధ్యాయ బృందం, స్థానికప్రముఖులు, విద్యార్థులు పాల్గొని ఇన్యాసమ్మకు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు.

🌐 Select Language:
📰 ePaper