

బేడ బుడగజంగం జిల్లా అధ్యక్షులు సిహెచ్ నరసింహులు
జనం న్యూస్ 2025 ఫిబ్రవరి 10( మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)
మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మెదక్ జిల్లా బేడ బుడగ జంగం జిల్లా అధ్యక్షులు సిహెచ్ నర్సింలు ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం అందించారు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బేడ బుడగ జంగం నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బేడ బుడగ జంగం అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగనన లో బేడ బుడగ జంగాలకు ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించడం బాధాకరమన్నారు
ఎస్సీ వర్గీకరణలో మాలలకు మాదిగలకు మూడు శాతం ఇవ్వడంలో బేడ బుడగజంగా కులానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు బెడగ బుడగ జంగం వర్గీకరణలో ఏ క్యాటగిరిలో చేర్చడం సంతోషమన్నారు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని పిల్లల ఉన్నది చదువుల కోసం ఉద్యోగ అవకాశాల కోసం గానీ మూడు శాతం రిజర్వేషన్ కేవలం బుడగజంగాలకే కావాలని కోరడం జరిగిందన్నారు. ఇప్పటికీ బుడగజంగా కులానికి ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదని ఎస్సీ వర్గీకరణతో బుడగ జంగం కులాన్ని తెరమీదకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు మాల మాదిగ కులాలలో ఉద్యోగ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ మా కులంలో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందలేక పోతున్నామని అన్నారు ఒకటి శాతం నుంచి మూడు శాతం వరకు బిగడ బుడజంగం కు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర దాసు దుర్గయ్య, భుజంగం, ఆంధ్ర సాయిలు నూనె పోచయ్య, భాజ దాదయ్య, ఎల్లప్ప భాస్కర్ నరసింహులు గోపాల్ శ్రీశైలం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.