ఈరోజు ఉదయ్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ తో సమన్వయ

August 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 04 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : భవన్‌లో సుదీర్ఘంగా సమావేశమైంది. సమావేశంలో ఉదయ్ టీమ్ ప్రతిపాదించిన పలు కీలక అంశాలపై సీఈఓ గారు ఎంతో సానుకూలంగా స్పందించారు: కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ రిజర్వేషన్లు పరిధిలో పనిచేసే నియామకాలలో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ పక్కాగా అమలు చేయడానికి చర్యలు.21 రకాల వైకల్యాలు – ప్రత్యేక కార్యాచరణ: 2016 ప్రకారం 21 కేటగిరీలకు చెందిన నిరుద్యోగ దివ్యాంగులకు ఎలాంటి శిక్షణ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే బాగుంటుందనే అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. స్వయం ఉపాధి & రుణ సహాయం: వికలాంగుల సంఘాలకు స్త్రీ నిధి రుణాలను వేగవంతం చేయడం మరియు ప్రత్యేక సబ్సిడీ గ్రాంట్ల మంజూరుపై హామీ.ఉపాధి హామీ చదువుకున్న దివ్యాంగులకు ‘మేట్’ (మస్టర్ పాయింట్ సూపర్ వైజర్) గా పనిచేసే అవకాశాలను నూరు శాతం కల్పించడం.దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఆచరణాత్మక పరిష్కారాలపై చర్చించిన దివ్య దేవరాజన్ ఐఏఎస్ కి ఉదయ్ అసోసియేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు కార్యక్రమం లో ఉదయ్ సంగమ్ రాష్ట్ర అధ్యక్షులు యం. శ్రీనివాసులు రాష్ట్ర జనరల్ సెక్రటరీ బి. వీరేష్ జాయింట్ సెక్రటరీ అంజయ్య నాగర్ కర్నూల్ ఉదయ్ జనరల్ సెక్రటరీ చంద్ర శేఖర్ తదితరులు కలిసినవారిలో ఉన్నారు

🌐 Select Language:
📰 ePaper