

.జనం న్యూస్ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, ఫిబ్రవరి 11, ():గిద్దలూరు : గిద్దలూరు మున్సిపాలిటీ 11వ వార్డు వైసిపి నాయకురాలు, నియోజకవర్గ అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలు బెల్లం రమాదేవి ఇటీవల ఆక్సిడెంట్ కి గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతి బాధాకరమని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి అన్నారు.ఆమె మృతి పట్ల నాగార్జున రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బెల్లం రమాదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరించేవారని, ఆమె మృతి పార్టీకి తీరని లోటన్నారు.వారి కుటుంబానికి తోడుగా ఉంటామని నాగార్జున రెడ్డి అన్నారు.