జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు ఎంఆర్ఓ కార్యాలయంలో అటెండర్‌తో వెట్టిచాకిరి
జనం న్యూస్ 04 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ) కార్యాలయంలో అటెండర్‌తో వెట్టిచాకిరి చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లతో పాటు ఇతర ఉద్యోగులు ఉపయోగించిన ( తిన్న) టిఫిన్ బాక్సులను అటెండర్‌తో కడిగిస్తున్నట్లు సమాచారం.ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత పనులు చేయించడం, టిఫిన్ బాక్సులు శుభ్రం చేయించడం వంటి పనులు అటెండర్ విధుల్లో భాగం కాదని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని కార్యాలయాల్లో పనుల కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, ఆరోపణలపై విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయడంతో పాటు, వాస్తవాలు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.