కూల్ ఎవరెస్ట్ ఐస్ క్రీమ్‌కు “బెస్ట్ ఐస్ క్రీమ్ బ్రాండ్” అవార్డు తెలంగాణ గ్లోబల్ ఎలైట్ బిజినెస్ అవార్డ్స్ 2026లో ఘన గుర్తింపు
జనం న్యూస్ ఆగస్టు 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి 2004లో స్థాపించబడి ఇరవై రెండు సంవత్సరాలుగా తెలుగు రాష్టాల ప్రజలకు సేవలందిస్తున్న ప్రీమియం మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్ బ్రాండ్ కూల్ ఎవరెస్ట్ ఐస్ క్రీమ్‌కు “బెస్ట్ ఐస్ క్రీమ్ బ్రాండ్” అవార్డు దక్కింది. హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో జరిగిన తెలంగాణ గ్లోబల్ ఎలైట్ బిజినెస్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించారు. ప్రముఖ సినీ నటి అదా శర్మ చేతుల మీదుగా కూల్ ఎవరెస్ట్ ఐస్ క్రీమ్ అధినేత, లయన్ వెంకటరెడ్డి యక్కంటి ఈ అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా లయన్ వెంకటరెడ్డి యక్కంటి మాట్లాడుతూ, “గత 22 సంవత్సరాలుగా 100% మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్‌లతో నాణ్యతకు పెద్దపీట వేస్తూ వస్తున్నాం. వినియోగదారుల నమ్మకమే మాకు అతిపెద్ద బలం. ఈ అవార్డు ఆ నమ్మకానికి దక్కిన గుర్తింపు. ముందు ముందు మరిన్ని వినూత్న రుచులతో అందరినీ అలరిస్తాం” అని తెలిపారు.స్వచ్ఛమైన పాలు, ప్రీమియం ఇంగ్రిడియంట్స్‌తో తయారైన మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్‌లతో కూల్ ఎవరెస్ట్ రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్టాల వ్యాప్తంగా కుటుంబాల అభిమాన బ్రాండ్‌గా నిలిచింది. ఈ అవార్డు సంస్థ సుదీర్ఘ ప్రయాణంలో మరో గర్వకారణం.