కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ గా నుండి ఎస్సై గా ప్రమోషన్ తిసుకున్న కుమారస్వామి*.

August 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం నడికుడ మండలం ధర్మారం గ్రామానికి చెందిన మామిడాల కుమారస్వామి కి ఎస్సై గా ప్రమోషన్ వచ్చింది ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సాధారణమైన వ్వక్తి 1989 లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు నెక్కొండలో మొదటిగా కానిస్టేబుల్ గా జాయిన్ అయ్యారు అ తర్వాత ధర్మసాగర్ సీరోలు ఆత్మకూర్ తొర్రూర్ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహించారు 2013 లో ములుగు వెంకటాపురం పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా బాధ్యతలు నిర్వహించారు అ తర్వాత 2020 లో ఏఎస్ఐ గా గీసుకొండ లో విధులు నిర్వహించారు 2024 నుండి శాయంపేట మండలం పోలిస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో ఆయన కి ఎస్సై గా ప్రమోషన్ రావడంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎస్సై గా ప్రమోషన్ రావడం మరింత బాధ్యత పెరిగిందని ఆయన తెలిపారు విధుల నిర్వాహణలో ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుతానని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా ఎస్సై గా ప్రమోషన్ వచ్చినా కుమారస్వామి కి మంగళవారం రోజున శాయంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ సిబ్బంది ఆయన కి ఘనంగా సన్మానించారు….

🌐 Select Language:
📰 ePaper